నీ సహనానికి హ్యాట్సాఫ్ రవి

2019 Latest Telugu Film News, Bigg Boss Contestant Ravi Krishna hats off to your patience, Tamanna bullies Ravi Krishna in Bigg Boss Telugu 3, Bigg Boss Contestant Ravi Krishna, Bigg Boss Contestant Ravi Krishna Latest News, Bigg Boss Telugu 3 Latest Updates, Ravi Krishna hats off to your patience, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Bigg Boss Contestant Ravi Krishna hats off to your patience

బాబోయ్ తమన్నా..! ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ రియాక్షన్ ఇదే. బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన తమన్నా.. నిజంగా ఆడియన్స్ సహనానికి ఓ పరీక్ష పెడుతుందని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ కే కాదు.. హౌస్ లో వున్నా మిగతా కంటెస్టెంట్స్ కి కూడా ఇది అగ్ని పరీక్షే. ఎందుకంటే తన నోటికి హద్దు లేకుండా మాట్లాడమే దీనికి కారణం.

నిన్నటి నామినేషన్ లో భాగంగా ఎవరికి నచ్చని వారిని వాళ్ళు నామినేషన్ చేశారు. దీనిలో భాగంగానే రవి కృష్ణ కూడా తన వంతు రాగానే తమన్నాని నామినేట్ చేస్తాడు. అంతే ఒక్కసారిగా తమన్నా తనలో వున్నా మరో యాంగిల్ బయట పెట్టింది. రవికృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టింది. సిగ్గులేదారా?. పప్పుగాడు అంటూ బాబోయ్ అంతకంటే దారుణమైన తిట్ల పురాణమే దండుకుంది. ఇతర కంటెస్టెంట్లు ఎంత నచ్చచెప్పటానికి ట్రై చేసినా.. కంట్రోల్ చేస్తున్నా..? ఆఖరికి వార్నింగ్ టైపులో చెప్పినా ఆబ్బే తమన్నా మాత్రం తన నోటిని కంట్రోల్ లో పెట్టుకోకుండా తిడుతూనే వుంది. సీజన్1, సీసన్2 లో ఇలాంటి కంటెస్టెంట్ ని మాత్రం చూడలేదు.

హైలైట్ ఏంటంటే తమన్నా ఎంత రెచ్చగొట్టడానికి ట్రై చేసినా.. తనను ఎంత తిట్టినా రవి కృష్ణ మాత్రం చాలా కూల్ గ తన పని చేసుకుంటూ… ఒక పక్క కోపం వస్తున్న బాలన్స్ కోల్పోకుండా చాలా పేషన్స్ తో తిరిగి ఒక్కమాటకూడా మాట్లాడకుండా సైలెంట్ గా వున్నాడు. దీనితో రవిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రవి పేషన్స్ లెవల్స్ కి హ్యాట్సాఫ్ చెపుతున్నారు. మరో వైపు తమన్నాని ఎలిమినేట్ చేయమని కోరుతున్నారు. ఆ తమన్నాని ఇంకా చూడలేమని ఆడియన్స్ బిగ్ బాస్ ను కోరుతున్నారు. తమన్నా ప్రవర్తనతో విసుగెత్తిన ఆడియెన్స్‌.. ఆమెను ఈవారం బయటకు పంపించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా ఎలిమినేట్‌ అవడం గ్యారంటీ అంటూ కామెంట్లుపెడుతున్నారు. అంతే కాదు ఈ వీక్ తమన్నా ఎలిమినేట్ అవుతుందని ఫిక్స్ కూడా అయిపోయారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here