డియర్ కామ్రేడ్ తెలుగు మూవీ రివ్యూ

Dear Comrade Movie Mouth Talk, Dear Comrade Movie Public Talk, Dear Comrade Movie Review, Dear Comrade Movie Review And Ratings, Dear Comrade Movie Story, Dear Comrade Review, Dear Comrade Telugu Movie Live Updates, Dear Comrade Telugu Movie Public Response, Dear Comrade Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Dear Comrade Telugu Movie Review

ఏ సినిమాపైన అయినా అంచనాలు ఉండటం కామన్ థింగ్. ఇక ఇప్పుడు అలాంటి భారీ అంచనాలతో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం విజయే. దానికి తోడు రష్మిక కూడా ఉండటంతో సినిమాపై ఇంకా హోప్స్ పెరిగాయి. మరి భరత కమ్మ దర్శకత్వంలో విజయ్ రష్మిక మళ్లీ జంటగా నటించిన డియర్ కామ్రేడ్ ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శ్రుతి రామచంద్రన్
డైరెక్టర్ – భరత్ కమ్మ
బ్యానర్ – బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్

కథ:

చైతన్య అలియాస్ బాబి (విజయ్ దేవరకొండ) స్వతహాగా విప్లవ భావాలున్న వ్యక్తి. వైజాగ్ నుండి కాకినాడ చదువుకోవడానికి వెళతాడు. అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మందన) స్టేట్‌ లెవల్‌ క్రికెట్ ప్లేయర్‌. హైదరాబాద్ నుండి చదువుకోవడానికి కాకినాడకు వస్తుంది. ఇక అక్కడ ఇద్దరికీ పరిచయం అయి అది కాస్త ప్రేమ వరకూ వెళుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. దాదాపు మూడేళ్ల తరువాత లిల్లీ ని కలవడానికి వచ్చిన విజయ్ కు లిల్లీ ఏ మానసిన సమస్యలతో బాధపడుతూ ఉంటుంది కనిపిస్తుంది. లిల్లీ అలా అవ్వడానికి కారణం ఏంటీ..? లిల్లీ ఆ పరిస్థితులో ఉండటానికి కారణం ఎవరు. ..? లిల్లీని అలా చూసిన ఈ డియర్ కామ్రేడ్ ఏం చేస్తాడు..? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూాడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి భరత్ కమ్మ తీసుకున్న పాయింట్ పాతదే అయినా తను చూపించిన విధానం మాత్రం బావుంది. అటు యాక్షన్.. ఇటు లవ్.. మరో పక్క కామెడీ ఇలా అన్ని కోణాలు కథలో చాలా చక్కగా అమర్చి ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడి మంచి స్క్రీన్ ప్లే ను అందించాడు.

ఈ సినిమాకు ఫస్ట్ ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉన్న యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ తన నటనతో ఎప్పటిలాగే సినిమా మొత్తం తనే కనిపించాడు. కాలేజ్ లో లీడర్ గా, అటు ప్రేమికుడిగా.. విడిపోయిన తరువాత భగ్న ప్రేమికుడిగా, హీరోయిన్ ను కష్టాల్లో నుండి బయటపడేసే ఓ కామ్రేడ్ లాగా ఇలా అన్ని కోణాల్లో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రష్మిక కూడా తన చిలిపి అల్లరితో నటనతో ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పొచ్చు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక విజయ్ ఫ్రెండ్స్ గా సుహాస్ తదితరులు చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది.

ముఖ్యంగా సంగీతం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా పనితనం కూడా చాలా బావుంది. కాకినాడ అందాలను చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

కథ
నటీనటులు
సంగీతం

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ లో అక్కడక్కడా స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు.

ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని జోనర్ లను కవర్ చేసి తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కళ్లు ఈ సినిమా చూడొచ్చని చెప్పొచ్చు.

డియర్ కామ్రేడ్ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3.5
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=sFMlzPMU9EI]

Summary
Review Date
Reviewed Item
డియర్ కామ్రేడ్ తెలుగు మూవీ రివ్యూ
Author Rating
41star1star1star1stargray

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + ten =