సాహో నుండి త్వరలో ‘ఏ చోట నువ్వున్నా’

#saaho, #YeChotaNuvvunna, Latest Telugu Movie News, Saaho Movie New Song, Saaho movie songs, Saaho Movie Updates, Saaho Songs, Saaho Telugu Movie Latest News, Saaho Telugu movie songs, Telugu Cinema Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Ye Chota Nuvvunna Song From Saaho To Be Out Soon
Ye Chota Nuvvunna Song From Saaho To Be Out Soon

‘సాహో’ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు నోట్లో వెలక్కాయ పడినంత పనైంది. అగష్ట్ 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ చెప్పడంతో కేవలం ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులే కాదు.. ప్రతి సినీ లవర్ సాహో కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ అది కాస్త మరో 15 రోజులకు వాయిదా వేశారు. కారణం ఏంటో తెలియదు కానీ.. ఆగష్ట్ 15న రిలీజ్ కావాల్సిన సినిమా ఆగష్ట్ 30వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను.. సయ్యా సైకో పాటను రిలీజ్ చేయగా వాటికి రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా లేట్ అవుతుండటంతో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ తన ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ సుజిత్ కు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఒక అభిమాని ట్రైలర్ గురించి అడగగా.. ట్రైలర్ ముందు రెండు పాటలు రానున్నాయని చెప్పాడు. ఎన్ని సోని అనే పాట ను మరో వారంలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ‘ఏ చోట నువ్వున్నా’ పేరుతో రిలీజ్ కానుందని తెలిపాడు.

 

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 9 =