లెజెండ్ క్రికెటర్ బయోపిక్ లో విజయ్ సేతుపతి

Latest Telugu Movie News, Telugu Cinema Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Vijay Sethupathi to act in Muttiah Muralitharan Biopic Movie, Vijay Sethupathi to play cricketer Muttiah Muralitharan, Vijay Sethupathi to play cricketer Muttiah Muralitharan in a biopic, Vijay Sethupathi to play Muttiah Muralitharan in Sri Lankan cricketer’s biopic, Vijay Sethupathi to play Muttiah Muralitharan in Sri Lankan legend’s biopic
Vijay Sethupathi to act in Muttiah Muralitharan Biopic Movie

ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు… సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ ఈ బయోపిక్ లో నటించే హీరో ఎవరనుకుంటున్నారా..? తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారట. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

1972లో శ్రీలంకలోని కాండీలో జన్మించిన ముత్తయ్య 1992 నుండి 2011 మధ్య శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1996లో తమ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 133 టెస్టుల్లో అత్యధిక వికెట్లు (800) తీసిన ఆటగాడిగా మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నాడు.

[subscribe]

[youtube_video videoid=idr0VLeZvMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eleven =