మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

Taapsee Pannu to act in Cricketer Mithali Raj Biopic,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Actress Taapsee Pannu Latest News,Heroine Taapsee Pannu Upcoming Movie News,Taapsee Pannu In Cricketer Mithali Raj Biopic,Mithali Raj Biopic Latest News
Taapsee Pannu to act in Cricketer Mithali Raj Biopic

మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ 200 వన్ డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో పాల్గొన్న మొదటి మహిళ. హైయస్ట్ రన్స్ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. వన్ డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో 6000 రన్స్ పైగా సాధించి మిథాలీ రాజ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అర్జున అవార్డ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ ని నిర్మించనుంది.

లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్ర నటి తాప్సీ మాట్లాడుతూ … మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ కై తనను సంప్రదించారని, మిథాలీ రాజ్ క్యారెక్టర్ లో నటించడానికి ఆసక్తి తో పాటు ఆతృతగా ఉందని చెప్పారు. తాను క్రికెట్ ఎప్పుడూ ఆడలేదని, ఈ మూవీ లో ఆ క్యారెక్టర్ ను ఛాలెంజ్ గా తీసుకున్నానని, మహిళా క్రికెటర్స్ ను మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడుగుతారని, మేల్ క్రికెటర్స్ ను మీ ఫేవరేట్ మహిళా క్రికెటర్ ఎవరు అని ఎందుకు అడగరని మిథాలీ రాజ్ అన్నప్పటినుండీ ఆమె ను ఫాలో అవుతున్నానని, ఆ రిమార్క్ తనతోపాటు ఉందని తాప్సీ అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here