బాలీవుడ్ బాట‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`?

#iSmartShankar, iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, iSmart Shankar to be Remade in Bollywood, Latest Telugu Movie News, Ram Pothineni iSmart Shankar Movie Remade In Bollywood, Telugu Cinema Updates, Telugu Film News 2019, Telugu Filmnagar
iSmart Shankar to be Remade in Bollywood

`ఇస్మార్ట్ శంక‌ర్‌`… టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్‌. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌… మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. అంతేకాదు… ఆల్రెడీ ప్రాఫిట్ జోన్‌లోకి వ‌చ్చేసిన ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌… రామ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ టాక్‌. ఇదిలా ఉంటే… ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. ఓ ప్ర‌ముఖ హిందీ నిర్మాత ఇప్ప‌టికే పూరితో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారని స‌మాచారం. అలాగే… బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌తో ఈ రీమేక్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `బ‌ద్రి`, `పోకిరి`, `టెంప‌ర్‌` చిత్రాలు హిందీలో `ష‌ర్త్‌`, `వాంటెడ్‌`, `సింబా` పేర్ల‌తో రీమేక్ కాగా… వీటిలో `వాంటెడ్‌`, `సింబా` బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో… `ఇస్మార్ట్ శంక‌ర్` కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి. అన్న‌ట్లు… `టెంప‌ర్‌` రీమేక్ `సింబా`లో ర‌ణ్‌వీర్ సింగ్‌ క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

[subscribe]

[youtube_video videoid=2RGiQ-zpWYU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =