సూపర్ కంటెంట్ తో వస్తున్న ‘అశ్వమేథం’

Ashwamedham Gearing up with Superb Content,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Ashwamedham Movie Updates,Ashwamedham Telugu Movie Latest News,Ashwamedham Movie Story Revealed,Ashwamedham Movie Highlight Points,Ashwamedham New Telugu Movie Gearing up with Superb Content
Ashwamedham Gearing up with Superb Content

‘అశ్వమేథం’.. ఈ మాట మనం మన పురాణాలలో చాలాసార్లు వినే ఉంటాం. ఒక దైవికమైన అశ్వాన్ని (గుర్రాన్ని) బలిదానమివ్వడమే దాని అర్ధం. ఇది అప్పట్లో రాజులు తమ దేశ ప్రజలకు శాంతిని, సుభిక్షాన్ని కలిగించేందుకు చేస్తారు. ఇక సుభిక్షత ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. శ్రీరాముడు బంగారు సీతమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని అశ్వమేథ యాగం చేస్తాడు…ఇలమహారాజు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఈ యాగం చేసినట్టు విన్నాం. అంటే ఎన్నో విధి విధానాలకు నిష్టగా కట్టుబడి ఉండి.. చేసే పని అని ఇప్పటి వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పొచ్చేమో. ఇప్పుడు ఈ ‘అశ్వమేథ యాగం’  గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే.. ఇప్పుడు అదే పేరుతో దృవ కరుణాకరన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అశ్వమేథం. ‘ఇంటెన్స్‌ ఉన్న స్పై థ్రిల్లర్‌గా నితిన్‌.జి దర్శకత్వంలో.. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రియా నాయర్‌, వందన యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, శుభ మల్హోత్రా, రూపేష్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

దీనిలో భాగంగానే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా…సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. చదరంగంలో ప్రావీణ్యమున్న ఒక వ్యక్తి ఊహించని పరిస్థితుల్లో చిక్కుకోవడం.. అనుకోకుండా హత్యలు చేయడం.. తనను ఆ పరిస్థితులకు ప్రేరేపించిన అతీతమైన శక్తిని తెలుసుకోవడాని హీరో తలపెట్టిన యజ్ఞమే ‘అశ్వమేథం’. అటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు… యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్లో చూపించారు. హీరోది ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా చేశాడనిపిస్తుంది టీజర్, ట్రైలర్లను చూస్తుంటే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా చేశాడు. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కూడా చిన్న సినిమానా?పెద్ద హీరో సినిమానా? అని చూడటంలేదు కాబట్టి.. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో ప్రాచి, సోన్యా, శివంగి కేదార్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సుమన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

[subscribe]

[youtube_video videoid=b1g0PLeomCQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − sixteen =