న‌వంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న బ‌న్నీ, బోయపాటి మూవీ!?

2019 Latest Telugu Movie News, Allu Arjun and Boyapati Srinu Movie To Kickstart from November, Allu Arjun and director Boyapati Srinu to team up again, Allu Arjun to work with Sarrainodu director Boyapati Srinu again, Allu Arjun Next Film With Boyapati Srinu, Allu Arjun and Boyapati Srinu Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Allu Arjun and Boyapati Srinu Movie To Kickstart from November

‘సరైనోడు’(2016)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను… మూడేళ్ల విరామం త‌రువాత మరోసారి జట్టుకట్టనున్నారు. ఈ సారి కూడా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ద్వయం… నాటి ‘సరైనోడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంద‌ట‌. కాగా… గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్రస్తుతం బన్నీ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఐకాన్’ లోనూ, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలోనూ బ‌న్నీ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. వీటితో పాటు ఇప్పుడు బోయ‌పాటి చిత్రం కూడా తోడ‌వ‌డంతో… బ‌న్నీ క్రేజీ లైన‌ప్ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.

[subscribe]

[youtube_video videoid=fCi_c7tZnC0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 5 =