ఫిల్మ్‌మేక‌ర్‌గా రాశీ ఖ‌న్నా

2019 Latest Telugu Movie News, Raashi Khanna Turns Filmmaker, Raashi Khanna As a Filmmaker in Venky Mama Movie, Raashi Khanna Character in Venky Mama Movie, Raashi Khanna Role In Venkey Mama, Raashi Khanna Role As Filmmaker, Raashi Khanna Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Raashi Khanna Turns Filmmaker

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి… మ‌ళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి ద‌క్కింది. కాగా… ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. ఆ చిత్రాలే… ‘వెంకీమామ’ (వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజ‌య్ దేవ‌ర‌కొండ – క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ మూవీ. వీటిలో నాగ‌చైత‌న్య‌కి జోడీగా న‌టిస్తున్న `వెంకీమామ‌`నే ముందుగా తెర‌పైకి రానుంది. అంతేకాదు… ఇందులో ఇదివ‌ర‌కు త‌ను పోషించ‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట రాశి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల‌ ప్ర‌కారం… `వెంకీమామ‌`లో ఆధునిక‌ భావాలు కలిగిన ఫిల్మ్ మేక‌ర్ పాత్ర‌లో దర్శనమివ్వనుందట రాశి. అలాగే… మనసు చెప్పిన‌ట్టు న‌డుచుకునే తలబిరుసు అమ్మాయిగా క‌నిపించ‌నుంద‌ట‌. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ పాత్ర‌లో రాశి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తుంద‌ని సమాచారం. మొత్తానికి… మరోసారి అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్రలోనే రాశి న‌టిస్తుంద‌న్న మాట‌. కాగా… కె.య‌స్.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `వెంకీమామ‌` దసరా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=7ZNuhUWCKzU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =