`ఇస్మార్ట్ శంక‌ర్‌`కి క‌లిసొచ్చిన పూరి సెంటిమెంట్

2019 Latest Telugu Movie News, Puri Jagannadh Sentiment Worked out for iSmart Shankar, iSmart Shankar Movie Worked With Puri Jagannadh Sentiment, Puri Jagannadh Sentiment In iSmart Shankar, iSmart Shankar Movie Latest News, iSmart Shankar Latest Updates, Puri Jaganath Hit Sentiment for Ismart Shankar, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Puri Jagannadh Sentiment Worked out for iSmart Shankar

ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ‌స్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ నెల 18న విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు… మొద‌టి మూడు రోజుల్లోనే ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని ట్రేడ్ టాక్‌. ఇదిలా ఉంటే… ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో ద‌ర్శ‌కుడు పూరికున్న ఓ సెంటిమెంట్ బ‌ల‌ప‌డిన‌ట్ల‌య్యింది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే… `ఎ` స‌ర్టిఫికేట్‌తో రిలీజైన పూరి డైరెక్టోరియ‌ల్స్‌ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త‌ వివరాల్లోకి వెళితే… గ‌తంలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘బిజినెస్‌మేన్’ వంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ జారి చేయ‌గా… ఆ మూడు చిత్రాలు కూడా పూరి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్‌గా నిలచిపోయాయి. క‌ట్ చేస్తే… ఇప్పుడు అదే బాట‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ‘A’ సర్టిఫికేట్ పొందడమే కాకుండా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. మున్ముందు కూడా పూరికి ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి మ‌రి.

[subscribe]

[youtube_video videoid=2RGiQ-zpWYU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =