జూలై సెంటిమెంట్‌ని కొన‌సాగించిన `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`

2019 Latest Telugu Movie News, Ismart Shankar Movie Latest News, July Sentiment Continued For Oh Baby And ISmart Shankar, July Sentiment Worked For Oh Baby And iSmart Shankar, Oh Baby And iSmart Shankar Continues July Sentiment, Oh Baby Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Oh Baby And iSmart Shankar Continues July Sentiment

టాలీవుడ్‌కి అచ్చొచ్చే నెలల్లో జూలై ఒక‌టి. ముఖ్యంగా… ఈ నెల‌లో వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ (`బొబ్బిలిపులి`(1982), `ఇంద్ర‌`(2002), `సింహాద్రి`(2003), `మ‌గ‌ధీర‌`(2009), `బాహుబ‌లి – ది బిగినింగ్‌`(2015)) న‌మోదైన వైనం ఉంది. ఇక గ‌త ఐదేళ్ళుగా అయితే వ‌రుస‌గా ఘ‌న‌విజ‌యాలు న‌మోద‌వుతున్నాయి. `దృశ్యం` (2014), `బాహుబ‌లి – ది బిగినింగ్‌` (2015), `పెళ్ళిచూపులు` (2016), `ఫిదా` (2017), `ఆర్ ఎక్స్ 100` (2018)… ఇలా గ‌త ఐదేళ్ళ‌లో ఏడాదికో ఘ‌న‌విజ‌యం ఉంటే… ఈ సంవ‌త్స‌రం ఆ సెంటిమెంట్‌ని కొన‌సాగిస్తూ ఏకంగా రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ న‌మోద‌య్యాయి. ఆ సినిమాలే `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `ఓ బేబీ` జూలై 5న విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిస్తే… రామ్ హీరోగా తెర‌కెక్కిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈ గురువారం (జూలై 18) రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. మొత్తానికి… వ‌రుస‌గా ఆరోసారి కూడా జూలై నెల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ న‌మోదు కావ‌డంతో… టాలీవుడ్‌లో `జూలై` సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. ఇక నెక్ట్స్ వీక్ రిలీజ్ `డియ‌ర్ కామ్రేడ్‌` కూడా ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తే…. ఈ ఏడాది జూలై మ‌రింత ప్ర‌త్యేకం అవుతుంది. అన్న‌ట్టు… `జూలై మంత్ స్పెష‌లిస్ట్‌` య‌స్‌.య‌స్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌` కూడా వ‌చ్చే ఏడాదిలో జూలై నెల‌లోనే (జూలై 30న) రిలీజ్ కాబోతోంది. అంటే… వ‌రుస‌గా ఏడోసారి కూడా జూలై నెల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ న‌మోదు కాబోతుంద‌న్న‌మాట‌.

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =