థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు

2019 Latest Telugu Movie News, Anil Ravipudi about Jagapathi Babu Exit From Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Secret Sacrifice, Jagapathi Babu Sacrifice for Prakash Raj, Sarileru Neekevvaru Team Cover Up On Jagapathi Babu Exit, Anil Ravipudi On Jagapathi Babu Exit, Sarileru Neekevvaru Movie Latest News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Anil Ravipudi about Jagapathi Babu Exit From Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించనున్న జగపతిబాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ప్రకాష్ రాజ్ కోసం మహేష్ బాబు, అనిల్ రావిపూడి రిక్వెస్ట్ తోనే జగ్గూభాయ్ తప్పుకున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక తాాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా జగపతిబాబుకు థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘జగపతి బాబుగారు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి చాలా ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఆయన తన పాత్రను ప్రేమించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆయన ఈ సినిమాలో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో జగపతి బాబుగారు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని అనిల్ రావిపూడి పోస్ట్ చేశాడు.

కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=shpVFz2yFSo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eleven =