జెర్సీ తమిళ్ రైట్స్ రానా చేతికి

2019 Latest Telugu Movie News, Rana to Produce Jersey Movie in Tamil, Jersey remake Latest News, Rana Daggubati Became producer with a tamil remake, Rana Daggubati Jersey remake Movie Updates, Rana Daggubati Latest Movie News, Rana Daggubati to producer Jersey remake In Tamil, Rana Daggubati Turns Producer In Tamil Industry, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Rana to Produce Jersey Movie in Tamil

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ద బెస్ట్ హిట్ దక్కింది జెర్సీతో. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా తమిళ్ లో కూాడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రీమేక్ హక్కులు దక్కించుకుంది ఏ తమిళ్ నిర్మాతో కాదు.. మన టాలీవుడ్ హంక్ రానా. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఓ కొత్త డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం. విష్ణు స్వతహాగా క్రికెట్ ప్లేయర్ కావడంతోనే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రానా. మొత్తానికి రానా ఓ పక్క క్రేజీ సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలను ఇతర భాషలకు తీసుకెళ్తున్నాడు. ఇది అభినందించాల్సిన విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=oRZ7oIv-TrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =