సరిలేరు నీకెవ్వరు – రిక్వెస్ట్ వల్లే తప్పుకున్న జగ్గూభాయ్..!

Prakash Raj In Place of Jagapathi Babu For Mahesh Babu Sarileru Neekevvaru

మహర్షి సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్… ఇప్పుడు అదే జోష్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జగపతిబాబు తప్పుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. మొదట తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పిన సన్నివేశాలు.. తను షూటింగ్ లో పాల్గొన్న తరువాత సన్నివేశాలను మార్చడంతో జగపతి బాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక జగపతిబాబు ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. జగపతి బాబు ఈ సినిమా నుండి తప్పుకోలేదట. దిల్ రాజు, మహేష్ బాబు రిక్వెస్ట్ తోనే జగపతిబాబు ఈ సినిమానుండి తప్పుకోవాల్సి వచ్చిందట. దీనికి కారణం ప్రకాష్ రాజేనట. గత కొద్దికాలంగా ప్రకాష్ రాజ్ సినిమాల్లో కంటే రాజకీయాల పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం తనకు ఓ మంచి రోల్ ఇవ్వమని తన ఫ్రెండ్ అయిన దిల్ రాజును అడిగాడట. అంతేకాదు… మహేష్ ను కూడా అడిగాడట. దీంతో వీరిద్దరిని పదే పదే అడగటంతో.. దిల్ రాజు, మహేష్ జగపతిబాబును రిక్వెస్ట్ చేశారట. ఇక వారి రిక్వెస్ట్ తో జగపతి బాబు సినిమానుండి తప్పుకున్నారట.

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి మరో కీలక పాత్రలో నటిస్తోంది. దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మరి ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత, మహర్షి సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను వీరు బ్రేక్ చేస్తారా?లేదా? చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=hnyNenuG-BM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 2 =