ఆమె తెలుగు మూవీ రివ్యూ – ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్

Aame Movie Mouth Talk, Aame Movie Public Talk, Aame Movie Review, Aame Movie Review And Ratings, Aame Movie Story, Aame Review, Aame Telugu Movie Live Updates, Aame Telugu Movie Public Response, Aame Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Aame Telugu Movie Review

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ‘ఆడై’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు చిత్రయూనిట్. నిజానికి ఈసినిమా నిన్న విడుదలకావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది…. అమలా పాల్ కు ఈసినిమా సక్సెస్ అందించిందా? లేదా? అన్నది తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – అమ‌లా పాల్,రమ్య సుబ్రహ్మణ్యం,శ్రీరంజని,వివేక్ ప్రసన్న
దర్శకత్వం – ర‌త్నకుమార్
నిర్మాతలు – రాంబాబు క‌ల్లూరి, విజ‌య్ మోర‌వెనేని
సంగీతం – ప‌్ర‌దీప్ కుమార్, ఊర్క‌
ఫొటోగ్రఫీ – విజయ్ కార్తిక్ ఖన్నన్

కథ:

కామిని (అమలాపాల్) చలాకీ మరియు స్వతంత్య్రభావాలు కలిగిన అమ్మాయి. ఉద్యోగరీత్యా ఓ ప్రైవేటు కంపెనీకి ప్రాంక్ వీడియోలు చేస్తుంటుంది. ఈ క్రమంలో తను పనిచేస్తున్న కంపెనీ వేరే ప్లేస్ కు మార్చాల్చి వస్తుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ డే పాత కంపెనీలో తన కొలీగ్స్ తో కలిసి పార్టీ ప్లాన్ చేస్తుంది అమలాపాల్. ఆ రాత్రి పార్టీ చేసుకున్న తరువాత.. తెల్లారే సరికి లేచి చూస్తే తాను బట్టలు లేకుండా ఒంటరిగా ఆ బిల్డింగ్ లో పడి ఉంటుంది. కామిని ఆ పరిస్థితిలో ఎందుకు ఉంది? కామిని ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఎవరు చేస్తారు..? అసలు ఆ రాత్రి ఏమి జరిగింది అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా టీజర్ తోనే అందరికీ షాకిచ్చింది అమలా పాల్. ఆమె ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నందుకు ఒకపక్క విమర్శలు తలెత్తినా.. మరోవైపు పలువురు సెలబ్రిటీల నుండి ప్రశంసలు దక్కాయి. నిజానికి సినిమా చూస్తే అమలాపాల్ ను ప్రశంసించక మానరు. సినిమాలో అమలాపాలే కనిపిస్తుంది తప్పా..మరెవరూ కనిపించరు. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాను ఒప్పుకున్నందుకు అమలాపాల్ గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథ చాలా కొత్తగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అనుభూతి కలుగుతుంది. మొదటి హాఫ్ లో ఆఫీస్, ఆమె వీడియోస్..సరదాగా సాగే సన్నివేశాలతో ఉండగా… సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఉత్కంట రేపే సన్నివేశాలతో సస్పెన్సు కొనసాగిస్తూ ఆసక్తికరంగా సాగింది. ఇక సినిమా క్లైమాక్స్ ద్వారా దర్శకుడు చెప్పిన సోషల్ మెసేజ్ కథకు తగ్గట్టుగా కుదిరింది. సినిమా ఎండింగ్ ఎమోషనల్ గా మరియు ఆలోచింపజేసేదిగా ఉంది.

ఇక డైరెక్టర్ రత్నకుమార్ మంచి లైన్ తీసుకున్నాడు. కథను తెరకెక్కించిన విధానం.. స్క్రీన్ ప్లేను చక్కగా రాసుకున్న విధానానికి మంచి మార్కులు వేయకతప్పదు. వైవిధ్యమైన కథకు ఆయన భావోద్వేగం జోడించి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది.

ఇక ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్ చాలా అవసరం. కెమెరా మెన్ విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ చాలా బాగుంది. అమలాపాల్ ను నగ్నంగా చూపే క్రమంలో ఎలాంటి తడబాటు లేకుండా.. ఎక్కడా వల్గారిటీ లేకుండా చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. సంగీతం పర్వాలేదు.

ఓవరాల్ చెప్పాలంటే అమలా పాల్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఆమె చూడొచ్చని చెప్పొచ్చు.

 

ఆమె తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3.5
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=1RfLCzGGmlU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eleven =