అల్లు అర్జున్ సినిమాలో సుశాంత్ పాత్ర అదేనా?

2019 Latest Telugu Movie News, Sushanth Character in Allu Arjun Movie Revealed, Akkineni Hero Sushanth in Allu Arjun Movie, Sushanth joins Allu Arjun film with Trivikram Srinivas, Sushanth roped in for Allu Arjun film , Allu Arjun New Movie Latest News, Sushant Joins with Allu Arjun Film For AA19, Sushanth Joins Trivikram Srinivas, AA19 Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Sushanth Character in Allu Arjun Movie Revealed

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ట‌బు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌వ‌దీప్‌, సునీల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీల‌క భూమిక‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఈ చిత్రం `కుండ మార్పిడి పెళ్ళి` కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోంద‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… బ‌న్నీ చెల్లెలుగా నివేదా న‌టిస్తుంటే… పూజకి అన్న‌గా సుశాంత్ క‌నిపిస్తాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో… బ‌న్నీ – పూజ‌, సుశాంత్ – నివేద మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్స్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం. మ‌రి… ఈ క‌థ‌నాల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here