ర‌వితేజ‌కి జోడీగా అదితి రావ్ హైద‌రీ?

2019 Latest Telugu Movie News, Ravi Teja to Team up with Aditi Rao Hydari?, Aditi Rao approached for Ravi Teja film, Aditi Rao Hydari to star alongside Ravi Teja, Aditi Rao Hydari in Ravi Teja next, Aditi Rao Hydari in Ravi Teja Maha Samudram Movie, RX 100 director ropes in Aditi Rao, Actor Ravi teja Latest Movie news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
అజయ్ భూపతి… గత ఏడాది ‘ఆర్ ఎక్స్ 100’ వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్‌ని అందుకున్న దర్శకుడు. తొలి చిత్రంతోనే నిర్మాతకు లాభాల పంట పండించిన‌ ఈ టాలెంటెడ్ డైరెక్టర్… తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. మొద‌టి సినిమాని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెర‌కెక్కించిన‌ అజయ్… ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం మాఫియా నేప‌థ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని టాక్‌. ఇదిలా ఉంటే… గత ఏడాది ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్.’ వంటి చిత్రాలలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులను మురిపించిన అదితీరావు హైదరీని… ఇప్పుడు ‘మహాసముద్రం’ కోసం హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు… ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందనీ… దానికి అదితి వంటి టాలెంటెడ్ హీరోయిన్ అయితేనే న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తోందట. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి… అదితి ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. కాగా… ప్రెజెంట్ రవితేజ ‘డిస్కోరాజా’ తోనూ, అదితీరావు హైదరి ‘వి’ చిత్రంతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=GaCfW-sCg08]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =