ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘తమ్ముడు’కి 20 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, Power Star Pawan Kalyan Thammudu Movie Completes 20 Years, 20 Glorified Years For Pawan kalyan Thammudu, Pawan kalyan Thammudu Completes 30 Years, Pawan kalyan Thammudu Successfully Completes 30 Years,Power Star Pawan kalyan Thammudu Telugu Movie, Pawan kalyan Latest movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
తెలుగునాట‌ క్రీడా నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు సందడి చేసాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకే వన్నె తెచ్చిన ఈ సినిమాలో పవన్‌కు జంటగా ప్రీతి జింగ్యాని నటించింది. బాలీవుడ్ భామ అదితి గోవిత్రీక‌ర్ మ‌రో నాయిక‌గా న‌టించ‌గా… అచ్యుత్, భూపేంద‌ర్ సింగ్‌, రాజా కృష్ణ‌మూర్తి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, చంద్రమోహన్, వ‌ర్ష‌ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన “పెదవి దాటని మాటొకటుంది”, “వయ్యారి భామ నీ హంస నడకా” పాటలు నిత్యనూతనంగా ఉంటాయి. ఇక రమణ గోగుల ర‌చ‌న‌లో “ట్రావెలింగ్‌ సోల్జర్” గీతం అయితే ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది. 1999 జూలై 15న విడుదలై ఘన విజయం సాధించిన `త‌మ్ముడు`… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. ‘తమ్ముడు’ – కొన్ని విశేషాలు: * హిందీ మూవీ ‘జో జీతా వహీ సికందర్’(1992), అమెరిక‌న్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిక్ బాక్సర్’(1989) స్పూర్తితో `త‌మ్ముడు` తెర‌కెక్కింది. * ఈ చిత్రంతోనే పి.ఎ.అరుణ్ ప్రసాద్ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. * కథానాయిక ప్రీతి జింగ్యాని వెండితెరకు పరిచయమైన తొలి చిత్రమిదే. ఇదే ఏడాది అంటే 1999లోనే ఇటు తెలుగు ఇండస్ట్రీతో పాటు అటు మలయాళ (‘మాళవిల్లు’), తమిళ (‘హలో’) పరిశ్ర‌మ‌లలోనూ అడుగు పెట్టి… ఒకే ఏడాది మూడు భాషల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాయికగా అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది ప్రీతి. * ఈ సినిమాలో సెకండ్ లీడ్‌గా న‌టించిన‌ అదితి గోవిత్రీకర్… న‌టిగా వెండితెరకు పరిచయమైన చిత్రం కూడా ఇదే. * పవన్ క‌ళ్యాణ్ స్టంట్ కో-ఆర్డినేటర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ ఫస్ట్ మూవీ ‘తమ్ముడు’. అనంతరం ‘బద్రి’, ‘ఖుషి’, ‘డాడీ’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్’ వంటి చిత్రాలకు కూడా స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేసారు ప‌వ‌న్‌. * “తాటిచెట్టెక్క‌లేవు”, “ఏం పిల్లా” వంటి పాటలతో (బిట్ సాంగ్స్‌) పవన్‌లోని గాయ‌కుడిని ప‌రిచ‌యం చేసిన సినిమా ‘తమ్ముడు’ కావ‌డం విశేషం. * పవన్, రమణ గోగుల కాంబినేషన్‌లో రూపొందిన ప్రథమ చిత్ర‌మిదే. ఆ తరువాత వీరిద్దరి కలయికలో ‘బద్రి’, ‘జానీ’, ‘అన్నవరం’ వంటి మ్యూజికల్ హిట్స్‌ వచ్చాయి. * పవన్ హీరోగా నటించిన ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మాటలను అందించిన చింతపల్లి రమణ ‘తమ్ముడు’కి కూడా డైలాగ్స్ రాయడం విశేషం. పవన్‌తో వరుసగా మూడు చిత్రాలకు పని చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు రమణ. * ఈ చిత్రాన్ని తమిళంలో ‘బద్రి’ పేరుతోనూ, కన్నడంలో ‘యువరాజా’ పేరుతోనూ, బెంగాలీలో ‘ఛాంపియన్’గానూ రీమేక్ చేయగా… అన్ని భాషల్లోనూ విజయం సాధించడం విశేషం.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది.. ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి..👇

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=A0zDh5Sgb-0]  

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + seven =