సాహో సాంగ్ పై పాకిస్తానీ సింగర్ ట్వీట్ కు థండరింగ్ రెస్పాన్స్

2019 Latest Telugu Movie News, Pakistan Singer comments on Saaho Song, Mawra Hocane comments on saaho song, Mawra Hocane Tweets on prabhas, Prabhas Latest Movie News, Prabhas Saaho Movie Latest Updates, Pakistani Heroine Comments About Prabhas, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
“బాహుబలి” సిరీస్ తో ప్రపంచవ్యాప్తమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం “సాహో ” రిలీజ్ కోసం వరల్డ్ ఫిలిం ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ప్రపంచ వ్యాప్త అభిమానులు నుండి విశేషమైన స్పందన లభించడం దీనికి వచ్చిన క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సుజిత్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా ఫిలిమ్ ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దశలవారీగా విడుదల చేసిన విజువల్ టీజర్స్ కు , సాంగ్ టీజర్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య విడుదల చేసిన ” సైకో సైన్ ” అనే పాట విజువల్స్ కు కూడా చాలా మంచి వ్యూయర్ షిప్ వచ్చింది. అయితే ఈ పాటను మెచ్చుకుంటూ పాకిస్తానీ మోడల్ – నటి మావ్రా హోకేన్ ఒక చిన్న ట్వీట్ పెట్టింది. “Prabhassss!!!!! # psycho saiyaan”- ఇదే ఆమె పెట్టిన ట్వీట్. ఈ మాత్రానికే నెటిజన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పాకిస్తానీ థియేటర్ లో, టీవీ సీరియల్స్ లో, మోడలింగ్ ఫీల్డ్ లో మంచి గుర్తింపు ఉన్న మావ్రా హోకెన్ 2016లో “సనం తేరి కసం” చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులకు, సినిమాకు పెద్దంతగా టచ్ లో లేని మావ్రా హోకేన్ ” సాహో” గురించి ట్వీట్ట్ చేయటం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకో గలిగింది. అది మన ” సాహో” కు ఉన్న క్రేజ్. అయితే భారతీయ చిత్రాలను అభినందిస్తూ ట్వీట్స్ పెట్టినా, లేదా ఏదైనా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినా అక్కడి చాందస వాదుల నుండి విపరీతమైన హరాస్మెంట్ ఉంటుంది. గతంలో ఈ అమ్మడు ” పఠాన్” అనే ఇండియన్ సినిమా గురించి ట్వీట్ పెట్టినందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి “సాహో ” ను “ఓహో ” అన్నందుకు ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి కష్టాలు రానున్నాయో !?

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=KnxkRr1A6e0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =