అస్సలు తగ్గని మన్మథుడు 2

2019 Latest Telugu Movie News, Nagarjuna Manmadhudu 2 Movie Release Date Revealed, Manmadhudu 2 Release Date Out, Nagarjuna Manmadhudu 2 Movie release date, Nagarjuna Telugu Movie, Manmadhudu 2 Movie Details,Manmadhudu 2 Movie Release Date, Manmadhudu 2 Release Date, Manmadhudu 2 Release Date Out, Manmadhudu 2 Telugu Movie Release Date, Manmadhudu 2 Telugu Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nagarjuna Manmadhudu 2 Movie Release Date Revealed

మన్మథుడు 2 టీమ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? సినిమా రిలీజ్ విషయంలో. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశలో ఉండగా… నాగార్జున అప్పుడే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమాను మొదటి నుండి ఆగష్ట్ 9వ తేదీనే రిలీజ్ చేద్దామనే ప్లాన్ లోనే ఉన్నారు. అయితే ఇదే ఆగష్ట్ నెలలో 15 వ తేదీన భారీ బడ్జెట్ సినిమా సాహో రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో చాలా సినిమాల డ్రాప్ అయ్యాయి. ఈనేపథ్యంలోనే మన్మథుడు 2 కూడా వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే మన్మథుడు 2 టీమ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగష్ట్ 9నే రావాలని ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగానే ఈవిషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు నాగార్జున. తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 9వ తేదీనే మన్మథుడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

కాగా ఈ సినిమాలో నాగార్జున సరసన కేవలం రకుల్ సింగ్ ప్రీత్ మాత్రమే కథానాయికగా నటిస్తుంది. సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.

[subscribe]

[youtube_video videoid=TLWmy4u_qYY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + fourteen =