అన్న కథను తమ్ముడి కోసం

2019 Latest Telugu Movie News, Interesting buzz on Anand Deverakonda new movie, Vijay Deverakonda jumps to help Anand Deverakonda, Vijay Deverakonda turns Chief Guest for Brother Anand Deverakonda, Anand Deverakonda Latest Movie News, Anand Deverakonda Upcoming Movie news, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Interesting buzz on Anand Deverakonda's new movie

దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేశాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా హీరో హీరోయిన్ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా రిలీజైందో లేదో అప్పుడే మరో సినిమాను ట్రాక్ లో పెట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం అన్న విజయ్ దేవరకొండ..తమ్ముడి రెండో సినిమాను లైన్లో పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భవ్యక్రియేషన్స్‌ బ్యానర్‌ కొత్త దర్శకుడితో ఆనంద్‌ రెండో సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే మొదటి సినిమాను కాస్త స్లోగా.. పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న స్టోరీను ఎంచుకోగా.. ఈసారి మాత్రం పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో రావాలని చూస్తున్నాడట. అంతేకాదు విజయ్‌ కోసం దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఆనంద్‌ కోసం తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు అన్నీ ఓకే అయితే ఈనెలలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి వార్తలు మాత్రమేనా.. నిజమేనా..? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతో.. వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ దూసుకుపోతున్నాడు. తాను నటించిన డియర్ కామ్రేడ్ ఈనెల 26వ తేదీన రిలీజ్ కు సిద్దంగా ఉంది.

[subscribe]

[youtube_video videoid=BriWfn5wTfc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =