గోపీచంద్ ‘చాణక్య’ మూవీ అప్‌డేట్‌

2019 Latest Telugu Movie News, Gopichand Chanakya Movie Latest Update, Gopichand Latest Movie News, Gopichand Chanakya Movie Updates, Chanakya Movie Shooting Updates, GopiChand As a Spy Ofiicer In Chanakya Movie, Gopichand TO Shoot song For Chanakya Movie, Gopichand Upcoming Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని స‌మాచారం. మెహ‌రీన్, జ‌రీన్ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… రాజస్థాన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింహ‌భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్… ప్రస్తుతం తుది దశలో ఉన్న‌ట్టు స‌మాచారం. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్ర‌కారం… ఈ నెలాఖరు కల్లా టాకీ పార్టును పూర్తి చేసి… వచ్చే నెలలో జరిగే షెడ్యూల్‌లో మిగిలిన మూడు పాటలను తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. కాగా… ప‌క్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారని ప్రచారం సాగుతోంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=9kj4Zqno5WY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 4 =