విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. ఆగష్ట్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఫస్ట్ సాంగ్ ను జులై 18 వ తేదీ, టీజర్ ను జులై 24వ తేదీ రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు. ఆ తరువాత పాటలు, ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
మరి ఈసినిమాలో నాని ఓ దొంగ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. వేర్వేరు ఏజ్ గ్రూప్‌లకి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతుందట. మరి సూపర్ హిట్ జెర్సీ మూవీ తరువాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న నానికి ఈ సినిమాతో కూడా హిట్ దక్కుతుందేమో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: