ప్రారంభానికి ముందే రచ్చ రంబోలా అవుతున్న బిగ్ బాస్ – 3

2019 Latest Telugu Movie News, Big Boss 3 Telugu gets into Controversy, Controversy on Big Boss 3, Big Boss 3 Latest news, Big Boss Season 3 Latest Controversy news, Bigg Boss Telugu season 3 to kickstart in June, Journalist Swetha Reddy Controversial Comments On Bigg Boss 3 , telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ – 3 జులై 21 నుండి ప్రారంభం కానుంది. దాంతోపాటు హడావుడి, హంగామా, పబ్లిసిటీ,బజ్,క్రేజ్, క్యూరియాసిటీ, నెగిటివ్ టాక్, ట్రోలింగ్స్, తిట్లు, శాపనార్థాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, వాటి కింద పచ్చి బూతుల కామెంట్లు- పోలీస్ కేసులు వంటి సకల దరిద్రాలు ప్రారంభమయ్యాయి. నిజానికి బిగ్ బాస్- సీజన్1 నాటి ఎదురుచూపు, ఆసక్తి, సస్పెన్స్ ల స్థానంలో ఇప్పుడు నానా రచ్చ వినిపిస్తుంది , కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం నుండే ప్రారంభమైన ఈ తరహా అల్లరి, నిర్వాహకులనే శాసించే సోషల్ మీడియా బెదిరింపులు ఈ షో ప్రతిష్టను దిగజార్చాయి. ఈ షో నిర్వహణను, ఓటింగ్ సరళిని, దాని ఫైనల్ రిజల్ట్ ను కూడా శాసించే స్థాయికి కంటెన్స్టెంట్ల సోషల్ నెట్వర్క్ పెరిగిపోయి చివరకు ఫలితాన్ని కూడా ప్రభావితం చేయటంతో ” బిగ్ బాస్- సీజన్ 2″ అన్ని విధాల అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్- సీజన్ 3 హోస్ట్ అక్కినేని నాగార్జున కావటంతో కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్లాక్మెయిలింగ్ కు తల ఒగ్గాల్సిన అవసరం, అగత్యం, భయం, దౌర్భాగ్యం బిగ్ బాస్ కు ఉండదు అనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో హోస్ట్ నానిని అన్ని విధాల అదిరించి బెదిరించి ఫలితాన్ని ప్రభావితం చేసిన పరిస్థితులు సీజన్ 3 లో రిపీట్ కావు అని అందరూ ఆశిస్తున్నారు. అయితే సీజన్ 2 షో ప్రారంభమైన కొద్దిరోజులకు కాంట్రవర్సీ ప్రారంభమై చివరకు వివాదాస్పదంగా ముగిసింది. కానీ సీజన్-3 ప్రారంభానికి ముందే రచ్చ రంబోలా అవుతుంది. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త అనే ఇద్దరు మహిళలు క్యాస్టింగ్ కౌచ్, మోసం తదితర ఆరోపణలతో నలుగురు ‘మా టీవీ’- ఉద్యోగులపై బంజారాహిల్స్, రాయగడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. “బిగ్ బాస్ ను తృప్తి పరచడానికి మీరు ఏం చేస్తారు? సెక్స్ లేకుండా 100 రోజులు ఎలా ఉంటారు? మీరు ఇంత లావు ఉంటే ఎలా? ఒళ్ళు తగ్గించడానికి ఏం చేస్తారు?” అగ్రిమెంట్స్ కూడా అయిపోయిన దశలో ఇలాంటి ప్రశ్నలు వేసి కమిట్మెంట్ కోసం మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ ఆ ఇద్దరు యువతులు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ సీజన్ 3 హైప్ కోసం “మా టీవీ” చేస్తున్న, చేయిస్తున్న పబ్లిసిటీ స్టంట్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా “బిగ్ బాస్ సీజన్- 3” ఓపెనింగ్ ఎట్మాస్ఫియర్ మాత్రం హెల్దీ గా లేదు.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=LVsE_Ge_AGo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + ten =