అఖిల్ 4 – ఫైనల్లీ ఆన్ సెట్స్

2019 Latest Telugu Movie News, Akhil Upcoming Movie Shoot Starts, Akhil 4th Movie Shooting Started, Akhil Akkineni to begin shooting for his next film, Akhil Akkineni fourth film shooting Updates, Akhil Akkineni Latest Movie News, Hero Akhil Next Movie Updates, Akhil commences shoot for film with Venky Atluri, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Akhil upcoming movie shoot starts

అఖిల్ అక్కినేని క‌థానాయ‌కుడిగా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకులతో పని చేయాలా..? లేక అనుభవం ఉన్న దర్శకులను ఎన్నుకోవాలా..? అనే విషయంలో చర్చలు జరిగిన అనంతరం ఫైనల్ గా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటుంది. మరో పది రోజుల వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై ప్రస్తుతం అఖిల్ ఉన్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేసుకోలేదు కాబట్టి.. త్వరలోనే సెలక్ట్ చేసి రెండో షెడ్యూల్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. కాగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి అఖిల్, హలో, మజ్ను ఇలా మూడు సినిమాల హ్యాట్రిక్ ఫ్లాప్స్ తరువాత.. ఎన్నో కథలు విన్న తరువాత.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్. మరి ఈసినిమాతో అయినా హిట్ ఖాతా తెరుస్తాడేమో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=0hkQJ4rnR44]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =