ఆడ – మగ స్నేహితుల కథలతో తెలుగునాట పలు చిత్రాలు రూపొందాయి. వాటిలో `వసంతం`కి ప్రత్యేక స్థానం ఉంటుంది. విక్టరీ వెంకటేష్, కళ్యాణి ప్రాణ స్నేహితులుగా నటించిన ఈ సినిమాని… వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. `నువ్వు నాకు నచ్చావ్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వెంకీకి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో ఆకాష్, సునీల్, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగఅశోక్ కుమార్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. 2003 జూలై 11న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘వసంతం’… నేటితో 16 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=pkEGwCGoP50]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: