వెంక‌టేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు

2019 Latest Telugu Movie News, Venkatesh Drushyam Movie Completed 5 years , 5 Glorified Years for Drushyam , 5 Years Completed Venkatesh Drushyam, Drushyam Telugu Movie, Victory Venkatesh Telugu Movies, Venkatesh Drushyam Completes 5 Years Today, Venkatesh Starrer Drushyam Movie Latest News , Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Venkatesh Drushyam Movie Completes 5 Years

విక్ట‌రీ వెంకటేష్, అందాల తార మీనా జంటగా పలు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘దృశ్యం’ ఒకటి. మహిళా దర్శకురాలు శ్రీ ప్రియ తెర‌కెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో నదియా, నరేష్ ముఖ్య భూమికలు పోషించ‌గా… కృతిక జయకుమార్, బేబి ఎస్తేర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, చలపతిరావు, అన్నపూర్ణ, ఉత్తేజ్‌, ర‌వి కాలె, స‌ప్త‌గిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

శరత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేట‌ర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ పతాకాలపై సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు. మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘దృశ్యం’(2013) ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగునాట కూడా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. 2014 జూలై 11న విడుదలై ఘ‌న‌విజ‌యాన్ని సాధించిన‌ ‘దృశ్యం’… నేటితో 5 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here