5 నిమిషాల కోసం 4 నెలల కష్టం

2019 Latest Telugu Movie News, Actress Rashmika Latest Movie News, Dear Comrade Movie Latest Updates, Rashmika Mandanna About Dear Comrade Movie, Rashmika Mandanna Speaks About Dear Comrade, Rashmika Mandanna Speaks About Hardwork Behind Cricket Player Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. జులై 26వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడే అవకాశం ఉందన్న టాక్స్ వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రష్మిక స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికోసం ఆమె ఎంతలా కష్టపడిందో చెప్పుకొస్తుంది ఈ కన్నడ భామ. ఈ సినిమాలో క్రికెటర్ గా 5 నిమిషాలు స్క్రీన్ పై కనిపిస్తానేమో కానీ.. దానికోసం మాత్రం నాలుగు నెలలు కష్టపడ్డాడని తెలిపింది. 20 రోజుల షెడ్యూల్ లో ఈ సీన్ తీశాం.. అంతేకాదు డబ్బింగ్ కోసం కూడా దాదాపు నాలుగు నెలలపాటు కష్టపడ్డాను.. ఎక్కడా ఏ చిన్న మిస్టేక్ లేకుండా చెప్పడానికి అంత టైం పట్టింది.. ఇప్పుడు ట్రైలర్ చూసిన తరువాత నేను పడిన కష్టానికి ఫలితం దక్కిందనిపిస్తుందని అంటుంది ఈ భామ. మరి సినిమా చూసిన తరువాత కానీ నిజంగానే రష్మిక మందన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పలేం.. చూద్దాం ఏం జరుగుతుందో..

ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది.

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =