మిక్కే జే మేయ‌ర్ కేరాఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌

2019 Latest Telugu Movie News, Mickey J Meyer Lined up with Interesting Projects, Mickey J Meyer Upcoming projects, Mickey J Meyer Latest Movie News, Mickey J Meyer Busy With 3 More Interesting Projects, Mickey J Meyer Next Project Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Mickey J Meyer Lined up with Interesting Projects

‘పోతే పోనీ’ చిత్రంతో టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు మిక్కీ జే మేయర్. ఆపై `హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `అ ఆ`, `మ‌హాన‌టి` త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన సినిమాల‌తో స్వ‌ర‌క‌ర్త‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మిక్కీ.

తాజాగా విడుద‌లైన‌ ‘ఓ బేబీ’తోనూ మ‌రోసారి మెస్మరైజ్ చేసిన మిక్కీ… ప్ర‌స్తుతం మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో హరీష్ శంకర్ రూపొందిస్తున్న‌ ‘వాల్మీకి’… ‘దిల్’ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘ఇద్దరి లోకం ఒకటే’తో పాటు శర్వానంద్ హీరోగా ఇటీవ‌ల ప్రారంభమైన ‘శ్రీకారం’ చిత్రానికి కూడా మిక్కీ బాణీలు స‌మ‌కూర్చుతున్నాడు. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌లో భాగమైన మిక్కీ… ఆ యా చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here