గుణ 369 ఫస్ట్ లిరికల్ ‘తొలి పరిచయమా ఇది’ రిలీజ్

Guna 369 First Lyrical Video Out,Telugu Filmnagar,Latest Telugu Movies News 2019,Telugu Film News,Tollywood Cinema Updates,Guna 369 Movie Updates,Guna 369 Telugu Movie Latest News,Guna 369 Movie Songs,Guna 369 Songs,Guna 369 Telugu Movie Songs,Guna 369 Movie 1st Song Tholi Parichayama Idhi Out Now
Guna 369 Movie 1st Song Tholi Parichayama Idhi Out Now

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గుణ 369’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ” తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది ” అంటూ ఈ పాట సాగుతోంది. శుభం విశ్వనాథ్ సాహిత్యం .. హరిచరణ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.

కాగా ఈసినిమాలో కార్తికేయ పక్కన మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తుండగా.. సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=bNDwN25mSWI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =