డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్

#DearComradeTrailer, Dear Comrade Movie Trailer Out Now, Dear Comrade Movie Updates, Dear Comrade Official Trailer, Dear Comrade Telugu Movie Latest News, Dear Comrade Telugu Movie Trailer, Dear Comrade Theatrical Trailer, Latest Telugu Movies News 2019, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda Dear Comrade Trailer
Dear Comrade Movie Trailer Out Now

విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున టైమ్ రానే వచ్చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త లేటవడంతో ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది?’ అంటూ విజయ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రష్మిక గురించి ఆమె స్నేహితులకు ఫిర్యాదు చేస్తూ.. ‘కైసీ కర్తీ ఇస్సే దోస్తీ.. చాలా కష్ట్‌ హై’ అంటూ వచ్చీ రాని భాషలో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది.

కాగా భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జులై 26న రిలీజ్ కానుంది.

విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు గీతాగోవిందం హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా చూద్దాం మరి ఈ భారీ అంచనాలను డియర్ కామ్రేడ్ రీచ్ అవుతుందో?లేదో?

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =