స్పీడుమీదున్న బన్నీ డబ్బింగ్ షురూ

Allu Arjun Starts Dubbing for AA19 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News 2019,Telugu Film News,Tollywood Cinema Updates,Allu Arjun Commences Dubbing for AA19,Dubbing Starts For AA 19,Allu Arjun Starts His Dubbing For AA19,Allu Arjun Starrer #AA19 Completes Shooting
Allu Arjun Starts Dubbing for AA19 Movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంగ్స్ మినహాయించి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఒక వైపున షూటింగ్ కొనసాగుతూ ఉండగానే, మరో వైపున బన్నీ డబ్బింగ్ ను కూడా ప్రారంభించాడు. ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆమె అల్లు అర్జున్ జోడీ కట్టడం ఇది రెండవసారి. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా, నవదీప్ .. సుశాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇది త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న 3వ సినిమా కావడంతో, హ్యాట్రిక్ హిట్ కొడతారో?లేదో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=gTL7JR0oN7o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =