మ‌రో డిఫ‌రెంట్ రోల్‌లో విజ‌య్

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda and Kranthi Madhav Movie Latest Update, Vijay Deverakonda next with Kranthi Madhav Goes on Floors, Actor Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda - Kranthi Madhav Movie News, Vijay Deverakonda Shooting Updates, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Vijay Deverakonda and Kranthi Madhav Movie Latest Update

వైవిధ్యభ‌రిత‌మైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న‌ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం… ఈ టాలెంటెడ్ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ప్లే బాయ్‌గా కనిపించనున్నాడ‌ట మ‌న రౌడీ హీరో. అయితే… ఇంతవరకు తెలుగుతెరపై వచ్చిన ప్లే బాయ్ రోల్స్ కు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఎంతో మెచ్యూర్డ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… ఫ్రాన్స్‌లో సెటిల్ అయిన విజయ్, ఇజాబెల్లి దంపతుల సన్నివేశాలతో ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రారంభమై… ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళడం జరుగుతుందట. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో భాగంగా… క‌థానాయ‌కుడి జీవితంలో ముఖ్య భూమిక పోషించిన ఇద్దరు అమ్మాయిలు… నిజ‌మైన ప్రేమ కోసం క‌థానాయ‌కుడి అన్వేష‌ణ‌… వంటి అంశాలు మిళిత‌మై ఉంటాయ‌ట‌. అంతేకాదు… ఈ క‌థ‌లో క్రాంతి మాధవ్ త‌న‌దైన శైలిలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్‌ను కూడా రాసుకున్నార‌ని తెలుస్తోంది. మరి ఈ కథనాలలో నిజమెంతో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్… ఈ ఏడాది చివర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

కాగా… విజయ్ దేవ‌ర‌కొండ‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.

[subscribe]

[youtube_video videoid=U6PqYcA5vFI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =