భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ మూవీస్ రూపొందించడం జరిగేది. రాజ మౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి తరువాత టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చి త్ర నిర్మాణం కొత్త పుంతలు తొక్కింది. బాహుబలి మూవీ తో తెలుగు సినిమాలు అంతర్జాతీయ మార్కెట్ ను సంపాదించుకున్నాయి. తెలుగు తో పాటు రెండు,మూడు ఇతర భాషలలో కూడా తెలుగు మూవీస్ రూపొందుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టాలీవుడ్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రూపొందుతున్న RRR భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిన సాహో మూవీ టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి, దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరో గా రూపొందనున్న హిరణ్య కశిప, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన మూడు భాగాల రామాయణం వంటి మూవీస్ అన్నీ వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకుంటున్నాయి.
[youtube_video videoid=htYIuLvMqWU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: