‘ఆర్ ఆర్ ఆర్’… రామ్ చ‌ర‌ణ్‌కి తండ్రిగా అజ‌య్?

2019 Latest Telugu Movie News, Ajay Devgn To play Father Role, Ajay Devgn To Play Interesting role in RRR, Ajay Devgn To Play Ram Charan Father In Rajamouli RRR, Ram Charan Father Character in RRR Movie Revealed, Ram Charan Reveals Father Character in RRR, RRR Movie Latest News, RRR Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Ram Charan Father Character in RRR Movie Revealed

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్… అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ నటిస్తున్న ఈ చిత్రంలో… బాలీవుడ్ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో అజ‌య్ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ మెగా ప్రాజెక్ట్‌లో చరణ్‌కు తండ్రి పాత్ర‌లో అజయ్ దేవగణ్‌ కనిపించనున్నాడట. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని స‌మాచారం. కాగా, నెక్ట్స్ షెడ్యూల్ నుంచి అజ‌య్ షూట్‌లో జాయిన్ కానున్నాడ‌ని అంటున్నారు.

స్వ‌ర‌వాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జూలై 30న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=lEdSZGzgv14]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =