య‌న్టీఆర్ ‘కదలడు వదలడు’కు 50 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, NTR Kadaladu Vadaladu Movie Completes 50 Years, 50 Glorified Years for NTR kadaladu vadaladu, 50 Years Completed NTR Movie Kadaladu Vadaladu, Kadaladu Vadaladu Telugu Movie, NTR Kadaladu Vadaladu Completes 50 Years Today,N T Rama Rao Telugu Movies, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, NTR Kadaladu Vadaladu Movie Latest News
NTR Kadaladu Vadaladu Movie Completes 50 Years

మహానటుడు యన్.టి.రామారావు, “జానపద బ్రహ్మ” బి.విఠలాచార్యది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో దాదాపు 13 జానపద చిత్రాలు తెరకెక్కగా… వాటిలో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి వ‌చ్చిన జానపద చిత్రాలలో ‘కదలడు వదలడు’ ఒకటి. జయలలిత కథానాయికగా నటించిన ఈ సినిమాలో రామకృష్ణ, సత్యనారాయణ, మిక్కిలినేని, ధూళిపాల, ముక్కామల, హేమలత, ఛాయాదేవి, విజయలలిత తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరధి, కొసరాజు గీత రచన చేయగా… యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పనలో రూపొందిన బాణీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా “ఇక్క‌డ వాడే అక్క‌డ వాడే”, “ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసి ముసి నవ్వుల చామంతి”, “బుల్లెమ్మ సౌఖ్యమేనా”, “కొమ్మ కొమ్మ కులికిన చోట” వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ పతాకంపై కె.సీతారామస్వామి, జి.సుబ్బారావు నిర్మించారు. 1969 జూలై 9న విడుదలై ఘన విజయం సాధించిన ‘కదలడు వదలడు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=bN0db6EqmdE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fourteen =