జూలై 9… తాత మ‌న‌వ‌ళ్ళ ఇండ‌స్ట్రీ హిట్స్‌

2019 Latest Telugu Movie News, July 9th A Special Day For Nandamuri Fans, NTR Bobbili Puli Telugu movie, Bobbili Puli And Simhadri Released On same Day, Special day for Nandamuri Family, JR NTR Latest Movie News, Jr NTR Simhadri Movie Latest News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
July 9th – A Special Day For Nandamuri Fans

జూలై 9… నందమూరి కుటుంబానికి క‌లిసొచ్చిన తేదీల్లో ఒక‌టి. ఎందుకంటే… ఇదే రోజున ఆ కుటుంబం నుంచి రెండు వేర్వేరు త‌రాల కథానాయకులు నటించిన శ‌క్తిమంత‌మైన‌ చిత్రాలు విడుద‌లై ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఇద్ద‌రి హీరోల్లో ఒక‌రు మ‌హానటుడు యన్.టి.రామారావు కాగా… మ‌రొక‌రు ఆయ‌న మ‌న‌వ‌డు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్. ఆ చిత్రాలే `బొబ్బిలిపులి`, `సింహాద్రి`.

ఆ చిత్రాల జ్ఞాప‌కాల్లోకి వెళితే… మ‌హాన‌టుడు యన్.టి.రామారావు, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొబ్బిలిపులి’. విజయమాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించగా… రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, మురళీమోహన్, ప్రభాకర్‌రెడ్డి, జగ్గయ్య, ప్రసాద్‌బాబు, జయచిత్ర, అంబిక, పుష్పలత తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. జె.వి.రాఘవులు స్వరసారథ్యంలో రూపొందిన “జననీ జన్మభూమిశ్చ”, “సంభవం నీకే సంభవం”, “తెల్లా తెల్లని చీరలోనా చందమామా”, “ఎడ్డమంటే తెడ్డమంటే”, “అది ఒకటో నెంబర్ బస్సు”, “ఓ సుబ్బారావు” పాటలన్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. 1982 జూలై 9న విడుదలైన ‘బొబ్బిలిపులి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నేటితో 37 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

కట్ చేస్తే… సరిగ్గా 21 ఏళ్ళ తర్వాత ఇదే తేదిన అంటే 2003 జూలై 9న యన్.టి.రామారావు మనవడు యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ విడుదలైంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తారక్ సరసన భూమిక, అంకిత కథానాయికలుగా నటించగా సీత, నాజర్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, రాళ్ళపల్లి, భానుచంద‌ర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. స్వరవాణి కీరవాణి అందించిన బాణీల‌న్నీ అలరించాయి. నటనలో తాత వార‌స‌త్వం పుణికి పుచ్చుకున్న తారక్… ఇదే జూలై 9న ‘సింహాద్రి’తో ఇండస్ట్రీ హిట్‌ని కూడా అందుకుని తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డ‌ని అనిపించుకున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here