ఆ సీన్స్ షూట్ లో టెన్షన్ పడ్డా

#Aame, 2019 Latest Telugu Movie News, Aame Movie Latest Updates, Actress Amala On Naked Scenes in Aame Movie, Amala opens up about her nude scene act, Amala Paul Latest Movie News, Amala Paul Opens up About his Nude Scene Shooting in Aame Movie, Amala Paul Speaks about doing a nude scene, Amala Paul Talks Nude Scene in Aame Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Amala Paul Opens up About her Nude Scene Shooting in Aame Movie

అమలాపాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’ టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ ను చూసి ఈ సినిమాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ ఈ సినిమాలో నగ్నంగా నటించే సీన్ల గురించి..తాను నటించేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్న విషయాలు చెప్పుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేను నటిగా కొనసాగాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు.. నేను సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ‘ఆడై’ (ఆమె) సినిమా నా ముందుకు వచ్చింది. అంతకుముందు చాలా కథలు విన్నాను.. కానీ ఏవీ నచ్చలేదు.. ఈ సినిమా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.. ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడే రత్నకుమార్ న్యూడ్ సీన్ ఉంటుందని..అయితే ఓ స్పెషల్ క్యాస్ట్యూమ్ ను ప్రిపేర్ చేస్తామని చెప్పాడు.. అయితే మీరేం కంగారు పడకండి అని అన్నాను. తీరా సీన్ చేయడాల్సి వచ్చిన రోజు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాను.

ఇక సెట్లో ఈ సీన్ తీసేప్పుడు కేవలం 15మంది ఉండేలా చూసుకున్నాను.. నేను వారిని నమ్మాను కాబట్టి ఆ సీన్ లో నటించగలిగాను అని తెలిపింది. అసలు కొన్ని సినిమాల స్క్రిప్ట్స్ చూసి సినిమాలు వదిలేద్దామనుకున్నా.. అవి లేడీ ప్రాధాన్యత సినిమాలే కానీ.. చాలా సింపుల్ కాన్సెప్ట్సే అందుకే ఆ సినిమాలు చేయకూడదనుకున్నానని తెలిపింది.

[subscribe]

[youtube_video videoid=Ob-NKC4VOzI]
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =