సునయన బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్

Actress Sunaina Back to Silver Screen,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sunaina Latest News,Heroine Sunaina Latest Movie,Sunaina Back To Silver Screen With Oh Baby Movie,Oh Baby Movie Updates,Oh Baby Telugu Movie Latest News,Sunaina Role In Oh Baby Movie,Sunaina Character In Oh Baby Telugu Movie,#Sunaina
Actress Sunaina Back to Silver Screen

చైల్డ్ ఆర్టిస్ట్ కమ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, సీరియల్ యాక్టర్ కమ్ కమ్ కమ్ పెట్టుకుంటూ పోవాలి సునయన గురించి చెప్పాలంటే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనసు మమత అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సనయన.. తన అభినయంతో అందరినీ మెప్పించింది. చిన్న వయసులో ఎంతో మెచ్యూర్డ్ గా నటించగలిగిన టాలెంట్ ఆమె సొంతం. దీనికి అమ్మోరు సినిమానే ఓ నిదర్శనం. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల్నింటిలో ఇదో మైల్ స్టోన్ లాంటి సినిమా.

దాదాపు 30 సినిమాలకు పైగా సునయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఒక్క టెన్త్ క్లాస్ లో మాత్రమే చదువు మీద ఫోకస్ పెట్టిన సునయన.. ఆతరువాత అటు చదువుకుంటూ.. ఇటు కెరీర్ ను కూాడా జాగ్రత్తగా చూసుకోగలిగింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలకు సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పింది. దూరదర్శన్, ఈటీవీ లాంటి ప్రముఖ ఛానెళ్లలో శిశిర వసంతం, దుర్గ, అలౌలిక ఇలా పది పన్నెండు సీరియల్స్ లో నటించింది. ఎఫ్ ఎమ్రేడియోలో కూడా రేడియా జాకీ గా చేసింది. అలా చేసుకుంటూనే అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాల్లో ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించింది.

ఆ తరువాత పెళ్లి జరగడం లాంగ్ గ్యాప్ రావడంతో సినిమాలకు దాదాపు దూరమైంది. అలా గ్యాప్ తీసుకున్న సునయన.. ఇటీవల మళ్లీ మ్యాంగో మీడియా లో ఫ్రస్టేషన్ ఉమెన్ అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తను చేసే ప్రతి ఒక్క ఎపిసోడ్ మన నిజ జీవితంలో జరిగే ప్రతిఒక్క సంఘటనకు చాలా దగ్గర ఉంటుంది. అటు కామెడీ చేస్తూనే.. ఇటు ఆలోచింపచేసేది ఉంటుంది. ఇక నటన అంటే కొట్టిన పిండి కాబట్టి… సింగిల్ టేక్ లో చేసేస్తూ ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే తాను సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు మ్యాంగో అధినేత అయిన రామ్ గారే నాకు ఈ అవకాశం ఇచ్చారని.. వారి సపోర్ట్ తోనే నేను ఫ్రస్టేషన్ ఉమెన్ అనే వెబ్ సిరీస్ తో అందరికీ దగ్గరయ్యాను.. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ అని చెబుతుంది.

ఇక ఇప్పుడు మరోసారి ఓ బేబి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సునయన. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా.. 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కానీ ఫ్రస్టేషన్ కూతురి పాత్రలో నటించింది.. ఇది సునయనకు బాగా తెలిసిన పాత్ర కాబట్టి నందిని రెడ్డి కావాలనే సునయనను తీసుకున్నట్టు ఉంది. అందుకే ఆ పాత్రలో అంత న్యాచురల్ గా నటించి మరోసారి బిగ్ స్క్రీన్ పై తన సత్తా చూపించింది. మరి ముందు ముందు కూడా సునయన ఇలాంటి మంచి పాత్రల్లో నటించి.. చైల్డ్ అర్టిస్ట్ గా అప్పట్లో ఎంత బిజీగా ఉండేదో.. ఇప్పుడు కూడా మంచి రోల్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ బిజీ అవ్వాలని కోరుకుందాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here