య‌న్టీఆర్‌ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు

2019 Latest Telugu Movie News,NTR Vetagadu Movie Completes 40 Years, 40 Glorious Years for NTR Vetagadu, 40 years for Vetagadu, NT Rama Rao movies, NTR Success Journey in telugu Film Industry, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
NTR Vetagadu Movie Completes 40 Years

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావుకి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం `వేట‌గాడు`. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో జగ్గయ్య, కాంతారావు, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నగేష్, చలపతిరావు, పుష్పలత, పండరీబాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జున్‌రాజు, కె.శివరామరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వరకర్త చక్రవర్తి అందించిన బాణీలు ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన “ఆకు చాటు పిందె తడిసే”, “బంగారు బాతుగుడ్డు”, “జాబిలితో చెప్పనా”, “కొండమీద చందమామ”, “ఓసోసి పిల్లకోడి పెట్ట”, “ఇది పూవులు పూయని తోట” , “పుట్టింటోళ్ళు తరిమేశారు” పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. 1979 జూలై 5న విడుదలై ఏడాదికి పైగా దిగ్విజయంగా ప్రదర్శింపబడిన ‘వేటగాడు’ చిత్రం… నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

 

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది.. ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి..👇

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here