కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్

2019 Latest Telugu Movie News, kannada heroines hungama in tollywood, kannada Actresses Busy With Telugu Film Projects, kannada Heroins with Telugu Projects, Pooja hegde Latest Movie News, Pooja hegde Busy New Projects, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, kannada Actors Busy In Telugu Industry,
Kannada Heroines Hungama in Tollywood

తెలుగు సినీ పరిశ్రమ అనే కానీ.. ఇక్కడ హవా చాటుతున్నది మాత్రం వేరే రాష్ట్రాల హీరోయిన్స్ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, బొంబాయి ఇలా పలు ప్రాంతాల నుండి హీరోయిన్స్ దిగుమతి అవుతుంటారు టాలీవుడ్ కి. ఇక్కడ లక్ కలిసొచ్చి ఒక్క సినిమా హిట్ అయిందా ఇక అంతే ఇక్కడ వరుసపెట్టి అవకాశాలు వచ్చేస్తాయి. అలా పక్క రాష్ట్రాల నుండి మన ఇండస్ట్రీ కి వచ్చి తిష్ట వేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు హీందీ వాళ్లు హవా చేస్తే… ఆ తరువాత మలయాళీ ముద్దు గుమ్మలు.. ఇప్పుడు కన్నడ భామలు తెలుగులో తమ హవా కొనసాగిస్తున్నారు.

శాండిల్ వుడ్ అని ఆ ప్రాంతానికి కరెక్ట్ గానే పేరు పెట్టినట్టున్నారు. ఎందుకంటే అక్కడి నుండి ఇంపోర్టెడ్ అయ్యే హీరోయిన్లు కూడా అలానే ఉంటారు కాబట్టి. నిజానికి కన్నడ హీరోయిన్ల హవా తెలుగు సినీ రంగంలో నడుస్తుంది ఇప్పుడే కాదు.. పాతకాలం నాటి నుండి ఆ సంప్రదాయం నడుస్తూనే ఉంది. అలనాటి బి సరోజాదేవి నుంచి జయంతి, జమున, జయలలిత, భారతి, సౌందర్య, కన్నడ మంజుల, రజనీ, ప్రేమ, ఆమని, అనుష్క శెట్టి, రక్షిత, హరిప్రియ, ప్రణీత, ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకొని బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఐశ్వర్యరాయ్, ఓం శాంతి ఓం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దీపికా పదుకొనే, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇలా కన్నడ నుంచి ఎగిరొచ్చిన అందాలు ఎన్నెన్నో. వీళ్లంతా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు.

ఇప్పుడు కూడా మన స్టార్ హీరోల పక్కన ఈ కన్నడ సుగంధాలే అవకాశాలు దక్కించుకుంటూ టాప్ రేస్ లో దూసుకుపోతున్నాయి. పూజా హెగ్డే, రష్మిక మందన, శ్రద్దా శ్రీనాథ్, నందిత శ్వేత, నిధి అగర్వాల్ తమ అందాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజాహెగ్డే కు ప్రారంభంలో పరాజాయాలే పలకరించాయి. అయినప్పటికీ అమ్మడి లక్ బావుండటంతో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లే వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత, మహర్షి సినిమాలు హిట్ కావడంతో.. ఈ అమ్మడికి ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. ప్రభాస్ 20 వ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తున్నది.

టాలీవుడ్ లో ప్రస్తుతం రేసు లో ఉన్న మరో హీరోయిన్ రష్మిక మందన. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు వచ్చి. ఈ అమ్మడు తన రెండో సినిమా గీత గోవిందంతో స్టార్ హోదానుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతులో ఈజీగా ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి.

కన్నడ ఇండస్ట్రీలో టాప్‌ ఫామ్‌లో కొనసాగుతున్న హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాథ్‌ ఒకరు. ఈ ఏడాది ఏకకాలంలో అటు బాలీవుడ్‌కు ఇటు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు శ్రద్ధ. తెలుగులో నాని హీరోగా రూపొందిన ‘జెర్సీ’లో సారా అనే పాత్ర చేసి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. సినిమాలో నాని, శ్రద్ధా కెమిస్ట్రీ బ్యాటు, బాల్‌లా ఉన్నాయని విమర్శకులు రాశారు. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో కూడా పలు తెలుగు సినిమాలు ఉన్నాయి.

‘నిన్ను రోడు మీద చూసినాది లగాయత్తు’ అని అప్పట్లో రమ్యకృష్ణ కోసం నాగార్జున పాడితే ఈ మధ్య నిధీ అగర్వాల్‌ కోసం నాగచైతన్య పాడారు. ‘సవ్యసాచి’లో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. పేరుకు తగ్గట్టే తెలుగు తెరకు దొరికిన ఓ నిధి ఆమె. తాజాగా రామ్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధీ అగర్వాల్‌. ప్రస్తుతం ఈ అమ్మడు కూడా మంచి ఫామ్ లో ఉంది.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో పరిచయమైన బెంగళూరు బ్యూటీ నందితా శ్వేతా. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ సినిమాల్లో కనిపించారామె. రాజశేఖర్‌ ‘కల్కి’లో కూడా నటించిన ఆమెకు మంచి పేరే దక్కింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘అక్షర’ సినిమాలో నటిస్తుండగా… అది రిలీజ్ కు రెడీ గా ఉంది.

త్వరలో తెలుగు తెరపైకి అడుగు పెట్టబోతున్న మరో కన్నడ అందం కృతి శెట్టి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త హీరో, సాయితేజ్ సోదరుడు వైష్టవ్‌తేజ్‌తో ఈ బ్యూటీ జోడీ కడుతోంది. ‘ఉప్పెన’ టైటిల్‌తో వస్తోన్న చిత్రంలో కృతిశెట్టి బలమైన పాత్ర పోషిస్తోందని వినికిడి.

ఇలా ఈ కన్నడ భామల ధాటికి మిగతా హీరోయిన్లకు అవకాశాలు కరువయ్యాయి. టాలీవుడ్‌ను కొద్దికాలం పాటు గంధపు పరిమళాలు అల్లుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వీరి హవా ఎంతకాలం ఉంటుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here