ఇటీవల ‘118’తో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్… ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ సరసన పంజాబీ భామ మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా… గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ రోజు (జూలై 5) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ‘ఎంత మంచి వాడవురా’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 17వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాతో… ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=77uSRTyvA2k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: