ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పూర్ ఓటింగ్ – బట్ రేర్ మెజారిటీస్

నిర్మాతల సమస్యల పరిష్కారం, నిర్మాతల సంక్షేమ సాధన అనే లక్ష్యాలతో పని చేయవలసిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. నిత్య అసంతృప్తి, నిత్య అసమ్మతి వాదం, నిత్య వివాదం నిత్య కృత్యమైన నిర్మాతల మండలి ఎన్నికలు నిన్న జరిగాయి. దాదాపు 1500 మంది సభ్యులున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో కేవలం 477 ఓట్లు మాత్రమే పోల్ అవ్వటం మండలిలోని అభిప్రాయభేదాలకు, అనైక్యతకు అద్దం పడుతుంది. ఏది ఏమైనా నిన్నటి ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ కావటం గమనార్హం. ఇటీవల జరిగిన  తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో మాదిరిగానే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో కూడా War and Victory  ఏకపక్షం అయిపోయాయి. అధ్యక్ష పదవికి పోటీ పడిన ఇరువురిలో ఒకరికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో పాటు , గెలిచిన అభ్యర్థుల మెజారిటీలు చాలా ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ శాతం ఎలా ఉన్నప్పటికీ  పోలైన ఓట్లలో అత్యధిక శాతం “మన కౌన్సిల్- మన ప్యానెల్” అభ్యర్థులకు రావటంతో మొత్తం నిర్మాతల మండలి సభ్యుల మనోగతం అర్ధం అవుతుంది. కాగా  ఈ ఎన్నికలలో  పోలైన ఓట్లు, ఎన్నికైన వారికి వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. * మొత్తం పోలైన ఓట్లు : 477 * అధ్యక్ష పదవికి పోటీ పడిన సీ కళ్యాణ్ కు వచ్చిన ఓట్లు: 377 * మరొక అభ్యర్థి ప్రతాని రామకృష్ణగౌడ్ కు వచ్చిన ఓట్లు: 95 * చెల్లని ఓట్లు. :   5 *   ఉపాధ్యక్షులుగా  పోటీ చేసిన వైవిఎస్ చౌదరికి:        360 క్ .అశోక్ కుమార్ కు:  317 నట్టి కుమార్            :  165 ఏకగ్రీవం: జనరల్ సెక్రటరీస్ : ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రెటరీస్: మోహన్ గౌడ్ సి ఎన్ రావు కోశాధికారి: చదలవాడ శ్రీనివాస రావు. ఎన్నిక కాబడిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్: 15 1) టీ.రామ సత్యనారాయణ: 405 2) వి. సాగర్                        : 391 3) పల్లి కేశవరావు                : 375 4) కే అమ్మిరాజు.                  : 374 5) శివలెంక కృష్ణప్రసాద్.        : 365 6) ఆచంట గోపీనాథ్.            : 352 7) జి వి నరసింహారావు.        : 352 8)  వజ్జా శ్రీనివాసరావు.         : 350 9) పి.సునీల్ కుమార్ రెడ్డి      : 333 10) పి ఎస్ ఆర్ కె ప్రసాద్       : 331 11) బండ్ల గణేష్ బాబు.         : 325 12) కామినీ వెంకటేశ్వరరావు  : 315 13) అశోక్ కుమార్ వల్లభనేని : 306 14) వి . వెంకటేశ్వరరావు.       : 306 15 ) ఎస్ కే నయీమ్ అహ్మద్  : 297 ఓడినట్లుగా డిక్లేర్ చేయబడిన నలుగురు అభ్యర్థులకు 239, 189, 150, 99 ఓట్లు పోలయ్యాయి. ఈ విధంగా పోలైన ఓట్లు తక్కువే అయినప్పటికీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యుల మద్దతు, మనోగతం మాత్రం వన్ సైడ్ గా ఉండటం గమనార్హం. ఇప్పుడు ఎన్నికైన సభ్యులు అందరూ దాదాపు ఒకే ప్యానల్ కు చెందిన వారే  కావటం వల్ల సమస్యల పరిష్కారానికి, సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం మరింత అంకితభావంతో పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ  నూతన కార్యవర్గం ప్రతిష్టాత్మకమైన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కృషి చేస్తుందని ఆశిద్దాం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=K8eI5moRD_c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =