మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌తో కార్తికేయ

2019 Latest Telugu Movie News, actor Karthikeya next movie updates, Karthikeya shooting updates, Karthikeya to act with Malayalam Heroine, Malayalam Heroine intresting role in Karthikeya next movie, Malayalam Heroine To Make Debut With Karthikeya Movie, Telugu Film Udates, Telugu Filmnagar, Tollywood Cinema News
Malayalam Heroine To Make Debut With Karthikeya Movie

ఇటీవలే హిప్పీ సినిమాతో కాస్త నిరాశ పరిచిన కార్తికేయ ఇప్పుడు గుణ 369 సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా… ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమాలో కూడా కార్తికేయకు జోడీగా ఓ మలయాళ ముద్దుగుమ్మనే నటిస్తుంది. అన‌ఘ అనే మలయాళ బ్యూటీ కార్తికేయకు పక్కన నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `గుణ 369`. కార్తికేయ హీరోగా న‌టించారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “కంటెంట్ డ్రైవ‌న్ ఫిల్మ్స్ తెలుగులో రావ‌డం లేద‌నుకునేవారికి స‌మాధానం చెప్పే విధంగా మా `గుణ 369` ఉంటుంది. టీజ‌ర్ చూసిన వారంద‌రూ అదే మాట అంటున్నారు. టీజ‌ర్‌లో హీరోయిన్‌ని చూసిన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు అన‌ఘ. కేర‌ళ భామ‌. మ‌ల‌యాళ న‌టీమ‌ణుల‌కు మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. అనఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. త‌మిళ చిత్రం `న‌ట్పే తునై`లో అన‌ఘ న‌టించారు. అందులో కొన్ని సీన్లు చూసి ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది“ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ “త‌మిళంలో `న‌ట్పే తునై`లో న‌టించిన అన‌ఘ‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఆమె స్టార్ మెటీరియ‌ల్ అని మా న‌మ్మ‌కం. మా సినిమాలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. చాలా చ‌క్క‌గా న‌టించింది. అదే స‌మ‌యంలో గ్లామ‌ర్ విష‌యంలోనూ ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. ఆమె స్వ‌త‌హాగా క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ కావ‌డంతో, డ్యాన్సుల విష‌యంలోనూ చాలా హెల్ప్ అయింది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు ఆమెలో ఉన్నాయి. మా హీరో కార్తికేయ స‌ర‌స‌న చ‌క్క‌గా స‌రిపోయింది. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ గురించి సినిమా విడుద‌ల‌య్యాక అంద‌రూ త‌ప్ప‌క మాట్లాడుకుంటారు. `గుణ 369` షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్ : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

[subscribe]

[youtube_video videoid=tpxgznrWqbc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =