సౌత్ రీమేక్ మూవీస్ లో బాలీవుడ్ హీరోలు

2019 Latest Telugu Movies News,Bollywood Heroes And Their South Remake Movies,South Movies Remake BY Bollywood Heroes, List of Bollywood remaked movies from south, Bollywood remakes of South Indian films, Telugu films remade in Bollywood, South Films Remade in Hindi,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Bollywood Heroes And Their South Remake Movies

బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన దక్షిణాది భాషల మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ విజయం సాధించడంతో పాటు , కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల, నిర్మాత, దర్శకుల చూపు దక్షిణాది చిత్ర పరిశ్రమల పై ఉందనడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కమర్షియల్ ఫెయిల్యూర్స్ లో ఉన్నపుడు ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి ని హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించి 233 కోట్లు కలెక్ట్ చేసింది. సల్మాన్ హీరోగా తెలుగు మూవీస్ రెడీ, కిక్ హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించాయి. అమీర్ ఖాన్ హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ గజిని హిందీరీమేక్ గజని 232 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో మలయాళ మూవీ మణిచిత్ర తళు హిందీ రీమేక్ భూల్ బులైయా ఘనవిజయం సాధించి 84 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు విక్రమార్కుడు హిందీ రౌడీ రాథోడ్ 206 కోట్లు, తమిళ తుప్పాక్కి మూవీ హిందీ హాలిడే 267 కోట్లు కలెక్ట్ చేశాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తమిళ, తెలుగు సూపర్ హిట్ మూవీ కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ లో నటిస్తున్నారు. ఇక అజయ్ దేవగన్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సర్దార్ (మర్యాద రామన్న ), దృశ్యం (దృశ్యం ), సింగం ( సింగం ) మూవీస్ 100 కోట్ల క్లబ్ లో చేరాయి. షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here