మేఘాంశ్ పాస్ అయినట్టే..!

2019 Latest Telugu Movies News,Srihari Son Meghamsh Impresses With Rajdooth Movie, Meghamsh Latest News, Meghamsh New Movie, Meghamsh Next Film Updates, Srihari Son Meghamsh Impresses Telugu Audience, Srihari Son Meghamsh Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Srihari Son Meghamsh Impresses With Rajdooth Movie

శ్రీహరి తనయుడు మేఘామ్ష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌, కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదుకానీ.. సినిమా రిలీజ్ ముందే మేఘాంశ్ కు మాత్రం మంచి పేరొచ్చింది. సినిమా హీరోకి కావాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయని.. సినిమా ఎలా ఉన్నా.. మేఘాంశ్‌ ఇండస్ట్రీలో హీరోగా నిలబడతాడని చెప్తుంది చిత్రబృందం. మేఘాంశ్ చాలా బాగా నటించాడని… అతని పాత్రకు మేఘాంశ్‌ పూర్తి న్యాయం చేసాడని ఒకటే ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి శ్రీహరి అటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తెలంగాణ స్లాంగ్ లో నవ్వించే పాత్రలైనా ఏ పాత్రైనా సరే అందులో ఒదిగిపోయి నటించి టాలీవుడ్ లో రియల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలాంటి శ్రీహరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. మరి మేఘాంశ్ అయితే పాస్ అయిపోయినట్టే అతనికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే.. మరి ఈ సినిమా హిట్ ను అందిస్తోందో.. రియల్‌ స్టార్‌ వారసుడిగా మేఘాంశ్‌ సంచలనాలు సష్టిస్తాడో చూడాలి.

కాగా కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ సినిమాలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌ తదితరులు నటించారు. వరుణ్ సునీల్ సంగీతం అందించిన ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్‌ విద్యా సాగర్ చింతా.

[subscribe]

[youtube_video videoid=jdNOXnee7Es]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =