రానా బాలీవుడ్ మల్టీ స్టారర్ షూటింగ్ షురూ

Rana Daggubati Bollywood Multi-starrer Movie Shoot Begins,2019 Latest Telugu Movie News, Bhuj The Pride Of India updates, Daggubati Rana new movie Bhuj The Pride Of India Launched, Rana Daggubati Starrer Bhuj The Pride Of India Launched, Rana Daggubati Upcoming Movie News, Rana new movie latest news, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Rana Daggubati Bollywood Multi-starrer Movie Shoot Begins

టాలీవుడ్ హల్క్ రానా అటు తెలుగు తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ షెడ్యూల్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విరాటపర్వం సినిమా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. ఇక రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించడమే తరువాయి భాగం. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాకు డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు రానా నటించబోతున్న బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ కూడా ప్రారంభమైంది. అజయ్ దేవ్ గన్, సంజయ్ దత్, రానా దగ్గుబాటి, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా, అమ్మీ విర్క్ తారాగణంతో అభిషేక్ దుద్యూ డైరెక్షన్ లో బుజ్ (ద ప్రైడ్ ఆఫ్ ఇండియా) అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఈరోజు నుండి మొదలైెంది.ఇక ఈసినిమాలో రానా కల్నన్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. టి సిరీస్, సెలక్ట్ మీడియా, ఎల్ఎల్పీ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2020 ఆగష్ట్ లో రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=20aZHly_zTY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twelve =