‘లా’ కి ‘ఇజ్జత్’ ఇచ్చే కట్టినమ్-లైట్ తీస్కో

Ram Pothineni Responds on Smoking in Public

‘డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో రామ్ పూర్తి హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ లో అలరించనున్నాడు. దీనిలో భాగంగానే తాను ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేసినా ఈ మధ్య అదే స్లాంగ్ లో ట్వీట్ చేస్తున్నాడు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా రామ్ తనపై నెట్టింట జరుగుతున్న ఓ డిస్కషన్ పై స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా… సిగరెట్‌ తాగినందుకు చార్మినార్‌ పోలీసులు రామ్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా చార్మినార్‌ వద్ద బహిరంగ ప్రదేశంలో సిగరెట్‌ కాల్చినందుకు ఆయన రూ.200 జరిమానా కట్టారు. అయితే దీనిపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో ఈ ఇష్యూపై తాజాగా రామ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

నా టైమ్, పబ్లిక్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేకనే రెస్మాండ్ గాలే. షాట్‌ ల కాల్చినా తమ్మి. బ్రేక్‌ ల కాదు. టైటిల్ సాంగ్‌ ల చూస్తావుగా స్టెప్పు. ఫిర్ బి ‘లా’కి ’ఇజ్జత్‘ ఇచ్చే ఫైన్ కట్టినమ్. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్ తీస్కో పని చూస్కో- ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. మరి నెటిజన్లు ఇప్పుడైనా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారో..?లేదో..? చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=M3bjgAiWpPA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =