పవన్ ఓటమిపై పరుచూరి పలుకులు..!

Paruchuri About Pawan Kalyan Defeat In Elections,Paruchuri Gopala Krishna About Pawan Kalyan Failure In AP Elections 2019,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Paruchuri Gopala Krishna About Power Star Pawan Kalyan,Pawan Kalyan Latest News,#PawanKalyan
Paruchuri About Pawan Kalyan Defeat In Elections

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత, పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఓటిమి మాత్రం ఏ ఒక్కరూ ఊహించనిదే. అందరూ రెండు నియోజక వర్గాల్లో ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారనే అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయం పై స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

1983 లో మొదటిసారి ప్రతిపక్షం అనేది గెలిచింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి పక్షాన ఉంటే ఆపార్టీ గెలుస్తుంది అనడానికి మనం ఒకసారి వెనక్కి వెళితే.. 1983, 85 ఎన్నికలు గమనిస్తే.. ఆ రెండు జిల్లాల్లో 90 శాతం కు పైగా టీడీపీకి ఓటు వేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అక్కడి నుండి ఉన్నారు. 1989లో ఆ రెండు జిల్లాలు టీడీపీకి దూరమయ్యాయి.. టీడీపీ అధికారానికి దూరమైంది. అలాగే 1994, 1999 లో ఆ రెండు జిల్లాలు తెలుగుదేశం వైపు ఉండటంతో గెలిచాయి. 2004, 2009 లో మళ్లీ ఆ రెండు జిల్లాలు టీడీపీకి దూరంగా ఉన్నాయి. మళ్లీ 2014 ఆ రెండు జిల్లాలు టీడీపీకి దగ్గరయ్యాయి. ఇదొకటి నేను కనిపెట్టగలిగాను.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర్పు కానీ.. ఇప్పుడు ఈ రెండు జిల్లాల తీర్పే అని చెప్పొచ్చు..

అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం.. చంద్రబాబుకు దూరమవ్వడం కారణమా అంటే నేను అక్కడ లేను కాబట్టి చెప్పలేను.. అయితే నాకు అనిపిస్తున్న నిజం ఏంటంటే.. గత పదేళ్లుగా గమనిస్తే జగన్ ప్రజల మధ్యన తిరుగుతానే ఉన్నారు..ప్రతి రోజూ.. ప్రతిరోజూ కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ.. ఆ ప్రజలను స్పందింప చేస్తూ.. తాను అధికారంలోకి వస్తే ఎంత గొప్ప గొప్ప మేలు చేస్తానో తను చెబుతున్నాడు కాబట్టి.. ఆనాడు ఎన్టీఆర్ లాగా ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో ఎలా మాట్లాడాడో.. అలా జగన్ చేశాడు కాబట్టి ఒకసారి జగన్ కు అవకాశం ఇచ్చి చూడాలన్న భావంతో ఓటు పడిఉండాలి.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తెలియదు కానీ.. ఆయన పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తైతే.. ఆయన ఓడిపోవడం ఒక ఎత్తు. కలలో కూడా ఏ అభిమాని ఊహించి ఉండడు… ఆంధ్రా ప్రజలు కూడా ఊహించి ఉండరు. ఆయన తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తారని భావించాను. ఆయన రాజకీయంలోకి వెళ్లిందే ప్రజలకు ప్రశ్నించే హక్కు నేర్పడానికి.. అనుక్షణం ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ప్రశ్నించే హక్కు గురించి మాట్లాడుతున్న ఆయన్ని.. అసెంబ్లీకి పంపించకపోవడం అనేది నమ్మసక్యం కానిదన్నారు. ఇంకా పవన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవెంటో కింద ఇచ్చిన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here