‘జెర్సీ’ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న క‌ర‌ణ్ జోహార్‌!?

Baahubali distributor buys Jersey rights, Jersey goes to Bollywood, Jersey Movie Updates, Jersey Telugu Movie Latest News, Karan Johar bought Jersey rights, Latest Telugu Movies News, Nani Jersey Movie Hindi Remake Rights Acquired By Karan Johar, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Top Bollywood filmmaker acquires Jersey remake rights
Nani Jersey Movie Hindi Remake Rights Acquired By Karan Johar

`జెర్సీ`… నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్‌లో ఓ మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌. ఈ ఏడాది వేసవికి విడుదలైన ఈ ఎమోష‌నల్ స్పోర్ట్స్ డ్రామా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో గౌత‌మ్ తిన్న‌నూరి తెరకెక్కించిన ఈ చిత్రం… స‌గ‌టు ప్రేక్షకుల‌ నుంచి సినీ ప్రముఖుల వరకు అంద‌రి ప్రశంసలను అందుకుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌రెవ‌రో కాదు… క‌ర‌ణ్ జోహార్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ ఆంగ్ల పత్రిక క‌థ‌నాల ప్ర‌కారం… రెండు రోజుల క్రితం ఈ సినిమా రీమేక్ రైట్స్‌కు సంబంధించి ‘జెర్సీ’ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ట కరణ్. అంతేకాదు… మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి… ఈ హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడ‌నీ… ఈ మేర‌కు గౌత‌మ్‌తో క‌ర‌ణ్ జోహార్‌ సంప్రదింపులు కూడా జరుపుతున్నాడని బాలీవుడ్ టాక్. దర్శకుడు ఫైన‌లైజ్‌ అయిన వెంటనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అలాగే… తాజాగా ‘కబీర్ సింగ్’ (తెలుగులో ‘అర్జున్ రెడ్డి’)తో మ‌రో ఘన విజయాన్ని త‌న సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు షాహిద్ కపూర్… ‘జెర్సీ’ రీమేక్‌లో హీరోగా న‌టించే అవకాశాలున్నాయని టాక్‌. త్వ‌ర‌లోనే `జెర్సీ` హిందీ రీమేక్‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=nJyz1l4iHn4]

 

nJyz1l4iHn4

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =